తెలంగాణలో మరో 647 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 1,20,213 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 81 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 9,625 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,213 శాంపిల్స్ పరీక్షించగా, 647 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 76, ఖమ్మం జిల్లాలో 58 కేసులు గుర్తించారు. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 1, నిర్మల్ జిల్లా 1 కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో 749 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,40,659 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,27,254 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,625 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,780కి పెరిగింది.

Telangana
COVID19
New Cases
Deaths

More Telugu News